త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న తెలుగు హీరో 18 d ago
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో పెళ్లిళ్ల హవా నడుస్తోంది. తాజాగా ఈ లైన్ లోకి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ చేరారు. నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని, ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం అని చెప్పారు. శ్రీనివాస్ సినీ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని అమ్మాయిని చేసుకోబోతున్నాడని వెల్లడించారు.